నవతెలంగాణ-మంథని
అసభ్య పదజాలంతో విమర్శించే మీ నాయకుడికి చెప్పాలని, సభ్యత సంస్కారం ఉన్న నాయకుడి దగ్గర పని చేస్తున్నాము కనుక విలువలతో కూడిన రాజకీయలు చేస్తున్నామని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ల నాగరాజు,మంథని సత్యం,జంజర్ల శేఖర్,ఎరుకల ప్రవీణ్ అన్నారు బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కుటుంబపరమైన శుభకార్యాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు.న్యాయవాద దంపతుల మృతిపై, పేదింటి బిడ్డ మంథని మధుకర్,ఇసుక మాఫియా వల్ల లారీల కింద చనిపోయిన మృతులపై చర్చ జరగాలన్నారు.అభివృద్ధి ద్వారా ప్రజలకు దగ్గర కావాలి కానీ,విమర్శలు చేసి ప్రజలకు చేరువ కావాలనుకోవడం మీ అవివేకానికి ఇది నిదర్శనమన్నారు.30 సంవత్సరాలలో సాధ్యంకాని అభివృద్ధి మంథని నియోజకవర్గంలో పుట్ట మధు 4 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తే మరలా తిరిగి ఎందుకు ఓడిపోయాడో మంథని తెరాస నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. మంథని నియోజకవర్గం మేధావుల నిలయమని,మీరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసిన ప్రజలు మీ నాయకుడిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో జె.ఎన్.టి.యు, ఆర్టికల్చర్,డిగ్రీ, పాలిటెక్నిక్,ఐటిఐ,కళాశాలను అన్ని మండలాలలో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసి విద్యకు పెద్దపీట వేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఏ నియోజకవర్గంలో కూడా మంజూరు కానీ 63 వేల ఇందిరమ్మ ఇండ్లను మంథిని నియోజక వర్గానికి మంజూరు చేసిన ఘనత శ్రీధర్ బాబుదే అన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూములు,నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కల్పించారో చెప్పాలని వారు ప్రశ్నించారు.అధిష్టానం మెప్పు కోసం పుట్ట మధు,పుట్ట మధు మెప్పు కోసం మంథని తెరాస నాయకులు మరొక్కసారి మాజీ మంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని,మా కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే తస్మాత్ జాగ్రత్తన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తోకల మల్లేష్,మంథని రాకేష్, అక్కపాక సదయ్య,ఆర్ల నారాయణ,జనగామ సడువలి,పొనగంటి రమేష్,కొప్పుల రాఘవ,బడికల మనోజ్, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 May,2022 05:02PM