నవతెలంగాణ-మంథని
మంథని మండలం సిరిపురం గ్రామంలో రామాయణం నాటక ప్రదర్శనను బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ప్రారంభించి విరాళం అందజేశారు. నేడు అంతరించిపోతున్న కళలు మరుగున పడిపోకుండా నేడు గ్రామాల్లో చిరుతల రామాయణంతో పాటు ఇతర ప్రదర్శనలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమన్నారు. బిజెపి మంథని మండల అధ్యక్షులు వేల్పుల రాజు,ఓబీసీ మోర్చా అధ్యక్షులు అరేఓదెలు,గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుతోట రవి,మంథని పట్టణ కార్యదర్శి వేల్పుల సామ్రాట్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm