నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలో బాధిత కుటుంబానికి సాయం అందించిన సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ వ్యవస్థాపకులు, ములుగు,భుపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు, మండల కేంద్రానికి చెందిన పొట్లూరి మధు ఇటీవలే అనారోగ్యంతో మరణించాడు,విషయం తెలుసుకున్న తస్లీమా బుధవారం వెళ్ళి వారి కుటుంబ సభ్యులను ఓద్దార్చి, పరామర్శించారు, కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని,ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని తస్లీమా అన్నారు,సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందించి సహృదయాన్ని చాటుకున్నారు,సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.