- పివైఎల్ నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు వాసరి సాయినాథ్..
నవతెలంగాణ డిచ్ పల్లి : రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు రద్దుచేయాలని అదేవిధంగా నిరుద్యోగ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 23న తలపెట్టిన చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ను విజయవంతం చేయాలని పి.వై.ఎల్ నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు వాసరి సాయినాథ్ పిలుపునిచ్చారు.బుదవారం నిజామాబాద్ రూరల్ లోని మోపాల్ మండల కేంద్రంలో పి.డి.ఎస్.యూ & పి.వై.ఎల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు రోజురోజుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం లక్షా 90 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని వారికి ప్రభుత్వమే ఉచిత వసతి సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారని వాటిని వెంటనే రద్దు చేయాలని ,విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 న చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించాడం జరుగుతుందని దీనికి నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ ,పివైఎల్ జిల్లా నాయకులు బండమీద నర్సయ్య, తంకటి భాస్కర్ , గంగాధర్ లు పాల్గొన్నారు.