నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన చెన్నయ్యగారి సిద్ధ రామ గౌడ్ బుధవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో నర్సింహులుకు కులస్తులు కుల బహిష్కరణ చేశారని ఫిర్యాదు చేశారు. తిప్పాపూర్ గీత కార్మిక సంఘంలో సభ్యత్వం ఉన్నదని, తనకు ఐదుగురు కూతుర్లు ఉన్నారని, తన కుమార్తెల వివాహం అయ్యేంతవరకు సంఘం తరఫున వచ్చే బెనిఫిట్స్ 2018 వరకు ఇచ్చారని, తన కుమార్తె వివాహం అయిన తర్వాత తనకు వచ్చే బెనిఫిట్స్ ను నిలిపివేయడంతో ఈ విషయమై ప్రశ్నించినందుకు తనకు కుల బహిష్కరణ తీర్మానం చేశారని, తను కుల బహిష్కరణ చేసిన సంఘ సభ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm