నవతెలంగాణ-భిక్కనూర్
ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ట్రాలీ ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు బస్వాపూర్ గ్రామ శివారులో స్థానిక జైకా హోటల్ సమీపంలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసిన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ కు చెందిన ఇంద్రసేన యువకుడిని అదుపులోకి తీసుకొని, కొనుగోలు చేసిన సుమారు ఎనిమిది క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm