-రూ.16000 నగదు అందజేసిన స్నేహితులు
నవతెలంగాణ-బెజ్జంకి
ఆనారోగ్య కారాణాలతో మృతి చెందిన సహచర విద్యార్థి కుటుంబానికి తోచినంత నగదు అందజేసి చేయాతనందించారు ఒకే తరగతికి చెందిన విద్యార్థులు. మండల పరిధిలోని వడ్లూర్ బేగంపేట గ్రామంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 2003-04 సంవత్సరంలో విద్యనభ్యసించిన ఎదురు రమేశ్ ఇటీవల ఆనారోగ్య కారణాలతో మృతి చెందాడు. బుధవారం అతని సహచర విద్యార్థులు తమకు తోచిన విధంగా నగదు సమకూర్చి.. మొత్తం రూ.16000 నగదును మృతుని కుటుంబానికి అందజేశారు. సహచర విద్యార్థి కుటుంబానికి చేయూతనందించిన స్నేహితులను పలువురు అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm