ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
వ్యాపారులు వర్తక మే ప్రధానం కాకుండా ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పసర లో కిరాణా షాపులు వాటర్ బాటిల్ తయారీ మరియు బేకరీ ఐటమ్స్ లో పలు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి వ్యాపారులతో మాట్లాడుతూ చట్టప్రకారం కచ్చితమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలని అన్నారు. నాణ్యత లోపం ఉన్న పదార్థాలను విక్రయించి నట్లు అయితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపారము లాభాలు తదితర అంశాలు ప్రధానం కాదని ప్రజా ఆరోగ్యం కూడా ముఖ్యమైన అవసరమని గుర్తించి విలువలతో కూడిన వ్యాపారం చేయాలని వ్యాపారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారులు. అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 May,2022 07:23PM