నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ నగరంలో నడిపిస్తున్న సిటీ బస్సులకు డ్రైవర్ లతో పాటు కండక్టర్ లను నియమించాలని జన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు డి.సంజయ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉషా దేవి కి బుధవారం వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో నూతనంగా ప్రారంభమైన సిటీ బస్సుల్లో డ్రైవర్లను మాత్రమే నియమించారన్నారు. దాంతో నగరంలో చాలా ట్రాఫిక్ ఉండటంవల్ల డ్రైవర్ ఒకరే డ్రైవింగ్ చేస్తూ టికెట్లు ఇవ్వడంతో యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉందని చెప్పారు.కావున కండక్టర్ లను నియమించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm