నవతెలంగాణ - అశ్వారావుపేట:
కేంద్రంలో బీజేపీ ఆద్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం నూతన మోటారు వాహనాల చట్టం తీసుకువచ్చి వాహన రంగ కార్మికుల పొట్ట కొడుతుంది అని కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు.రోడ్డు సేఫ్టీ బిల్లు రద్దు చేయాలని గురువారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో అరుణ పతాకాలను చే తెచ్చి బూని కార్మిక సంక్షేమ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.ఈసందర్బంగా పిట్టల అర్జున్, ప్రభాకర్, సలీం మాట్లాడుతూ ఈ చట్టం కేవలం విదేశాలలో ఉన్న చట్టాల అనుగుణంగా మనదేశంలో మోటారు కార్మికులపై సేఫ్టీ పేరు చెప్పి భారీ చలాన్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగినదని,ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాపితంగా రవాణారంగ కార్మికులు అనేక ఆందోళనలు, సమ్మెలు చేయడం జరిగినది. అయినా కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరించి మోటారు కార్మికుల నడ్డి విరిచి, వేలాది, లక్షలాది రూపాయల ఫెనాల్టీలు ఈ చట్టంలో పొందుపరిచి, మోటారు కార్మికుల బతుకులపై పెనుభారం మోపినది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మోటారు వాహనాల చట్టం 2019ని వ్యతిరేకిస్తూ సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలోనే ప్రజలకు వ్యతిరేకమైన ఈ బిల్లును తెలంగాణాలో అమలు చేయనని చెప్పడం జరిగినది. వారు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు అమలు చేయకపోయినా, రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు 'ఈ' ఛలాను పేరు మీద రూ.1,035/-లు, ఓవర్ లోడ్ పేరుతో భారీ చలాన్లు వేస్తున్నారు.
ఈ చలాన్లను అన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 1 నుండి జి.ఓ. నెం. 714 ప్రకారం ఫిట్నెస్ రెన్యువల్ గడువు అయిన తరువాత రోజుకు రూ. 50/-ల చొప్పున పెనాల్టీలు వేస్తున్నారు. ఒక్కొక్క వాహనం గత 2,3 సంవత్సరాలు నుండి ఫిట్నెస్లు పెండింగ్లు ఉన్నవి. గత రెండు సంవత్సరాలుగా కరోనా వలన, ఆటో, క్యాబ్, లారీ కార్మికులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం, ఖజానాను నింపుకోవడానికి ఆటో, క్యాబ్, లారీ కార్మికులపై భారీ జరిమానాలు విధించడానికి పూనుకున్నాయి. ఫిట్నెస్ రెన్యువల్ లేట్కు రోజుకు రూ. 50/-లు ఈ విధానం అమలు చేస్తే, ఆటోలు, క్యాబ్లు, లారీలు అమ్ముకున్నా చెల్లించలేని పరిస్థితులలో కార్మికులున్నారు. కావున వెంటనే రోజుకు రూ.50/-ల పెనాల్టీని వెంటనే రద్దు చేసి రవాణారంగ కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆటో, క్యాబ్, లాకీ సంఘాలు జేఏసీ విజ్ఞప్తి చేస్తున్నది. దీనితో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచడం వలన రాష్ట్రాలలో వాహనాలు నడపలేని పరిస్థితులలో మోటారురంగ కార్మికులున్నారు. ఈ ధరలతో సామాన్యుడు భరించలేని విధంగా, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మోటారురంగ కార్మికులు ఈ ధరల వలన బ్రతకలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రఫీ, సత్యనారాయణ, శ్రీను, మున్నా తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 03:25PM