నవతెలంగాణ కంటేశ్వర్
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి ని గురువారం కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన ఫోటోకు పూల మాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ.. సుందరయ్య తొమ్మిదవ తరగతి నుండి సమానత్వం విప్లవ భావజాలంతో పెరిగిన టువంటి వ్యక్తి అని.. ఆ ఉన్నత కులం రెడ్డి వర్గం లో జన్మించినప్పటికీ సామాన్య మానవులకు సేవ చేయాలనుకుంటే అంకితభావాన్ని కల్పించుకున్నారన్నారు. అంతేకాకుండా వంద ఎకరాల భూమిని పేదలకు నిస్వార్థంగా పంచ్ ఇచ్చిన వ్వ్యక్తి అని కొనియాడారు.
'దక్షిణ భారతదేశాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి అంకితభావంతో పని చేసినటువంటి వ్యక్తి.. భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి సల్పిన మహనీయులు. ఎస్సీ ఎస్టీ బిసి ఇండ్ల వద్దకు వెళ్లి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి వారితో సమానంగా కూర్చుని నటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుని ఆశయసాధనలోనే 1998 కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మగౌరం సమానత్వం కులనిర్మూలన కార్యక్రమాల నిర్వహించారు. ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు, అలాగే రెండవ సారి అసెంబ్లీలో కూడా ప్రతిపక్షంగా ఉండి పేదల యొక్క అభివృద్ధికి చర్చించిన మహనీయుడు. పార్టీ అభివృద్ధికి దక్షిణ భారత దేశం కోసం, సీపీఐ(ఎం) అభివృద్ధికి కృషి చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు నిచ్చెన మెట్ల సమాజానికి ఊతం ఇస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని ఎంపీలు ప్రసంగాలు చేస్తున్నారు` అని అన్నారు. ఈ కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 04:55PM