నవతెలంగాణ - సిద్దిపేట
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని వీఆర్ఏల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఐరేని రవీందర్ డిమాండ్ చేశారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న ఛలో సిసిఎల్ఎ ఆఫీసు కార్యక్రమం పోస్టర్ ను గురువారం ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వి ఆర్ ఎ లు గా విధులు నిర్వహిస్తూ అర్హత కలిగిన వారందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలుచేస్తామని సెప్టెంబర్ 2020 న ఒకసారి, మార్చి 15 , 2022 న మరోసారి ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అది అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న ఛలో సిసిఎల్ఎ ఆఫీసు కార్యక్రమం నిర్వహించి తలపెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల రవి, రవితేజ, శ్రీనివాస్, మల్లేశం, బాల్ రాజు, రజిత, సుజాత, భూలక్ష్మీ, రాజు, శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, బాలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 05:34PM