- సీఐటీయూ జిల్లా నాయకులు పొదిల చిట్టి బాబు
నవతెలంగాణ-గోవిందరావుపేట
కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ములుగు జిల్లా సీఐటీయూ నాయకులు పొదిల చిట్టిబాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జాతీయ బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. ఆటో డ్రైవర్ యూనియన్(సీఐటీయూ) 160 మూడవ జాతీయ రహదారిపై ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన 714 జీవో రద్దు చేయాలంటూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ అల్లం రాజ్ కుమార్ కు అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ ఫిట్నెస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆటో క్యాబ్ వంటి చిన్న వాహనాల యజమానులు డ్రైవర్ల కార్మికుల పొట్ట కొడుతుందని ఆయన అన్నారు. కరోనా కష్టకాలంలో కిరాయిలు లేక అష్టకష్టాలు పడిన ఆటోడ్రైవర్లకు 714 జీ ఒ తో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో పాలక ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి, అంబాల మురళి, పల్లపు రాజు, డోని సాయిలు, ఎండి రహీం, భూక్యా అంజి, భూక్యా శ్రీకాంత్, గోరంట్ల సాంబశివరావు, కమల్ భాష, చంద్రయ్య, బాబర్, శంకర్, కృష్ణంరాజు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 05:40PM