- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ కంటేశ్వర్
ప్రజల మనిషి సుందరయ్య జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శనీయ వర్ధంతి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఇతర నాయకులకు ఆదర్శవంతమైన అని, నిత్యం ఆయన ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి పోరాట కార్యక్రమాలను నిర్వహించారని ఆయన అన్నారు. సమాజంలో ఉన్న అంటరానితనం వివక్షతకు వ్యతిరేకంగా చిన్నతనంలోనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసి అందరూ సమానమే అని చాటి చెప్పారని, పాలేర్లు సమస్యలను తెలుసుకొని వారి వేతనాల పెంపుదల పనిగంటల అమలు కొరకు పాలేరు లను ఐక్యం చేసే పోరాటాలు నిర్వహించారని ఆయన అన్నారు. కులాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో తన పేరు చివరన ఉన్న రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని కష్టజీవుల కొరకు నిత్యం దోపిడీ లేని సమాజం నిర్మించాలని పరితపించారు. అదేవిధంగా పార్లమెంట్ లో మొదటి ప్రతిపక్షనేతగా నిత్యం సైకిల్ పై నే పార్లమెంట్ కు వెళ్లి పార్లమెంట్లో ప్రజాసమస్యలను గళమెత్తి చాటారని అనే ఆ విధంగా నేటితరం నాయకులకు ఆయన ఆదర్శంగా నిలిచారని అన్నారు సుందరయ్య గారి మాటలు నాయకులు పని చేయగలిగినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సబ్బని లతా, ఎం గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, అజయ్, అనిల్, సూరి, మరియు మహేష్ అనిత తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 05:44PM