- పిడిఎస్ యూ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు జన్నారపు రాజేశ్వర్, సంతోష్
నవతెలంగాణ డిచ్ పల్లి
నిరుద్యోగ ,విద్యారంగ సమస్యల పరిష్కారానికై మే 23న చలో ప్రగతి భవన్ ముట్టడి కి యూనివర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని పి.డి.ఎస్.యూ తే,యూ అధ్యక్ష,కార్యదర్శులు జన్నారపు రాజేశ్వర్,సంతోష్ లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చలో ప్రగతి భవన్ ముట్టడి పోస్టర్స్ ను యూనివర్సిటీ లైబ్రరీ ముందు తే.యూ పిడిఎఫ్ యూ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష తొంభై వేల ప్రభుత్వ ఉద్యోగలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులు రోజు రోజుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రతి సంవత్సరం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లను రద్దు చేయాలని , ప్రభుత్వమే ఉచిత కోచింగ్ వసతి కల్పించాలని,
రాష్ట్రంలో ఉన్న ప్రయివేటు యూనివర్సిటీలను రద్దు చేయాలని, ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ యూనివర్సిటీని నెలకొల్పాలని, పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి,పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని,శ్రీ చైతన్య నారాయణ తదితర కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని,పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలనే డిమాండ్స్ తో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామని కావున యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో తే.యూ కమిటీ నాయకులు అక్షయ్,సుజిత్, హన్మాండ్లు,రాజ్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 06:04PM