- ఇంటింటికి ప్రచారం చేసే విధంగా రచ్చబండ నిర్వహించి ఇంటింటికి ప్రచారం చేయాలి
నవతెలంగాణ కంటేశ్వర్
వరంగల్ డిక్లరేషన్ పై గ్రామగ్రామాన రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి ఇంటింటికి ప్రచారం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి ,అర్బన్ ఇంచార్జి తాహెర్బిన్ హందాన్ ,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, బాన్సువాడ ఇన్చార్జ్ బాలరాజ్ పాల్గొన్నారు.ఈసందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన నియోజకవర్గ బాధ్యులు ప్రతి నియోజకవర్గంలో వరంగల్ డిక్లరేషన్ పై రచ్చబండ నిర్వహించి ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమాన్ని 500 మంది తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని అదే విధంగా 30 రోజుల కార్యక్రమంలో భాగంగా 30 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ జిల్లాలో పెరుగుతుందని, రేవంత్ రెడ్డి గారు జిల్లాకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు పసుపు పంటకు 12 వేల రూపాయల మద్దతు ధర ఇస్తామని, అదేవిధంగా మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిబద్ధతతో వరంగల్ డిక్లరేషన్ లో పసుపు బోర్డు, చెరుకు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తామని డిక్లరేషన్ లో ప్రకటించారని, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పసుపును ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ఆయన గుర్తు చేశారు. చత్తీస్ ఘడ్ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని, 2500 రూపాయల మద్దతు ధర తో వడ్లు కొనుగోలు చేస్తుందని, రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజు మీట్ ద ప్రెస్ లో వరంగల్ డిక్లరేషన్ ల పేర్కొన్న అంశాలను నెరవేర్చడానికి డబ్బులు ఏవిధంగా సమకూరుస్తామో అనే విషయాన్ని క్లుప్తంగా వివరించారని, రాష్ట్రంలో ఎవరూ ఊహించనంత చురుగ్గా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని, జిల్లాలో టీఆర్ఎస్ బిజెపిలు తోకలు ముడుచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ గురించి పాదయాత్ర చేసి, పసుపు బోర్డు గురించి బాండ్ పేపర్ రాసిచ్చి వాటి గురించి మాట్లాడకుండా అసదుద్దీన్ గడ్డం గురించి మాట్లాడుతున్నడని సమస్యల గురించి పట్టించుకోడని, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఎర్రజొన్న కొనుగోలు చేసింది కానీ ఎన్నికల తర్వాత కొనుగోలు చేయాలేదని ,ఎలక్షన్లు దగ్గరకు వస్తున్న సందర్భంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కొనుగొలు కేంద్రాలు తీసి వేస్తుందని, టిఆర్ఎస్ బిజెపిల దొంగనాటకాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 80 నియోజకవర్గాలు వ్యవసాయంపై ఆధారపడ్డాయి అని వరంగల్ డిక్లరేషన్ తో లక్షల కుటుంబాలకు ఆనందం కలుగుతుందని, కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని రాజస్థాన్ ఛత్తీస్ గఢ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేసిందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వరంగల్ డిక్లరేషన్ను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా అర్బన్ ఇంచార్జ్ తాహెర్బిన్ హందాన్ మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్ మేధావులు రైతు సంఘాల నాయకులతో కలిసి ఏర్పాటు చేశారని, నిజామాబాద్ జిల్లాలో మానాల మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వరంగల్ డిక్లరేషన్ గ్రామ గ్రామాన తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తామని ,కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పన్నెండు వందల కోట్ల విద్యుత్ బకాయిలు ఏకకాలంలో మాఫీ చేశారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా బాన్సువాడ ఇన్చార్జి కాసుల బాలరాజు మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాంట్రాక్టులు టిఆర్ఎస్ నాయకులకు ఇచ్చి ఇసుక మాఫియా చేస్తున్నాడని భూమి ఉన్న పేదలకు ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వడం లేదని, ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ పార్టీలు డబ్బులు విచ్చలవిడిగా పంచడానికి సిద్ధమవుతున్నారని ,కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవని కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లో తిరుగుతూ టిఆర్ఎస్ బిజెపిల మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా మాజీ ఓబిసి అధ్యక్షులు శేఖర్ గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఓబిసి అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ ,ప్రభగండ, కమిటీ చైర్మన్ జాబితా అక్రమ్ మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 06:07PM