నవతెలంగాణ-మంథని
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ ధరలు పెంపుతో పాటు అనేక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఆటో యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం మంథనిలో ఆటోల బంద్ విజయవంతమైంది.ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటోలు నడువకపోవడంతో ప్రయాణికులు అనేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. బస్సులు నడని ప్రాంత ప్రజలు వ్యయప్రయాసలకోర్చి ఇబ్బందులు పడ్డారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2019 మోటార్ వాహన చట్టం తీసుకు వచ్చిందని, తాజాగా నేడు జీవో నెంబర్ 714 తీసుకు వచ్చిందని,ఏప్రిల్ 1 నుండి రెన్యువల్ కోసం రోజు రూ.50 రూపాయలు ఫైన్ విధిస్తూ డిజిల్ రేట్ లను విపరీతంగా పెంచిందన్నారు.తాజాగా మోటార్ వాహన చట్టం తీసుకువచ్చి డ్రైవర్లను దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని,పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సంఘం నాయకులు, డ్రైవర్లు, యజమానులు, పాల్గొనగా, వివిధ పార్టీల నాయకులు, అఖిలపక్ష నాయకులు, సంఘీభావం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 06:12PM