నవతెలంగాణ-మంథని
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మంథని గోదావరి నది వద్ద అంతిమ సంస్కారానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి నది తీరంన స్మశాన వాటిక నిర్మాణం పనులు జరుగుతున్నాయి.ప్రజల అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో మంథని మునిసిపాలిటీ ఆధ్వర్యంలో గోదావరి తీరంలో కోటి రూపాయలతో చేపట్టిన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.గోదావరి నది ఒడ్డున వెలసిన పాత స్మశాన వాటికలు గోదావరి నది పెరిగినప్పుడల్లా భౌతిక యాల దహన సంస్కారాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ త్వరితగతిన వైకుంఠ దామాలు నిర్మించడంతో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.త్వరలోనే స్మశాన వాటికలు అందుబాటులోకి రానున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 06:14PM