నవతెలంగాణ - అశ్వారావుపేట:
జాతీయ సేవ (ఎన్.ఎస్.ఎస్) ప్రత్యేక శిభిరంలో భాగంగా అశ్వారావుపేట కళాశాల విద్యార్థులు నాల్గవ రోజు గురువారం పామ్ ఆయిల్ తోటల పెంపకంలో చేపట్టవలసిన మెళకువలు, జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన శిభిరానికి ముఖ్య అతిధిదగా భారత ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ సంచాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వి ప్రసాద్,టి.ఎస్ ఆయిల్ ఫెడ్ డివిజనల్ మేనేజర్ ఉదయ్ కుమార్ విచ్చేసారు. వీరు పామ్ ఆయిల్ తోటల్లో చేపట్ట వలసిన జాగ్రత్తలు,నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, చీడ పీడల నివారణ, కోత, కోత అనంతరం చేపట్టవలసిన జాగ్రత్తలు, రైతులకు వివరించారు. అనంతరం రైతులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కె. చలపతి రావు, ఆయిల్ పామ్ రైతు సంఘ అధ్యక్షులు శీమకుర్తి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కళాశాల ఆచార్యులు గోపాల కృష్ణ మూర్తి, శ్రీనివాస రెడ్డి,ఎన్.ఎస్.ఎస్ అధికారులు రామ్ ప్రసాద్, రమేష్, స్రవంతి, వాలంటీర్లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 06:16PM