- ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్..
నవతెలంగాణ డిచ్ పల్లి
ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి సబ్సిడీ పై జిలుగు విత్తనాల ను పంపిణీ చేస్తుందని దీనిని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ అన్నారు.గురువారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి సొసైటీ పరిధిలో గల అన్ని గ్రామాలకు జీలుగా విత్తనాలను సబ్సిడీ ద్వారా 664.20 పైసలకు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఐడిసిఎంఎస్ చైర్మన్, రాష్ట్ర డైరెక్టర్ సాంబారు మోహన్, వైస్ ఎంపీపీ అంజయ్య లు మాట్లాడుతూ కెసిఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఆదుకోవడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తుంద న్నారు.దినిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నల్లవెల్లి సహకార సొసైటీ కి 1,133 బ్యాగులు వచ్చినాయి ఇతర గ్రామాల రైతులు ఆందోళన చేందవల్సిన అవసరం లేదన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నోముల విజయలక్ష్మి లక్ష్మారెడ్డి, సొసైటీ సొసైటీ వైస్ చైర్మన్ రమేష్, సీఈఓ తేజగౌడ్, సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, పూదరి మనోహర్, పిప్పెరా మురళి, కన్నె జనకవ్వ, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మనోహర్, కోశాధికారి తిమ్మన, రైతు సమన్వయ కమిటీ కో ఆర్డినేటర్ దుండ్ర రాజన్న రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 06:17PM