నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలోని డబుల్ బెడ్రూం గృహాల కరెంట్ కోసం జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గురువారం చెక్ రిలీజ్ చేశారు. గతంలో డబుల్ బెడ్రూం గృహాల్లో లబ్ధిదారులు విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ దృష్టికి టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నామ్ పూర్ణచందర్ తీసుకువెళ్లారు. దాంతో వారు పరిశీలించి గురువారం అందుకు సంబంధించిన చెక్కును రిలీజ్ చేశారు. చెక్ రిలీజ్ చేయడంతో టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పూర్ణచంద్ర తో పాటు డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంజీవ, విజయ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 06:34PM