నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని ఓ గ్రామానికి చెందిన మత్స్య పరిశ్రమ శాఖ డైరెక్టర్ మరియు సీనియర్ నాయకులు మెరుగు కనక లక్ష్మి - రమేష్ ల కుమారుడి రిసెప్షన్ కు ఎమ్మెల్యే సీతక్క హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ వలే రమేష్ కుమారుడు భవిష్యత్తులో ప్రయోజకుడు గా ఎదిగి మంచి నాయకుడు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తెళ్ళ హరి ప్రసాద్,మండల ప్రధాన కార్యదర్శి పూర్ణ చందర్, చపాల నరేందర్ రెడ్డి,పడిదల సాంబయ్య,ముల కుమార్,రవి, తళ్ళ శ్రీను,మోహన్ రెడ్డి,పొన్నం సాయి,పిరీల శ్రీను తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm