-టీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది
-రానున్న ఎన్నికల్లో పార్టీ పని చేసిన వారికే పెద్దపీట
-కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పోన్నం
నవతెలంగాణ-బెజ్జంకి
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రశ్నించే వారిని అణచివేతకు గురి చేస్తున్నాయని, అణచివేతలోనే నాయకత్వం పురుడుపోసుకుంటుందని కరీంనగర్ మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక సత్యార్జునా గార్డెన్ యందు కాంగ్రెస్ పార్టీ మండలాద్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అద్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా కరీంనగర్ మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీ ప్రజా సమస్యలు పట్టించుకొకుండా భాగ్యలక్ష్మి ఆలయం చుట్టే తిరుగుతున్నాడన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు,రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గుత్తేదారులకు దోచి పేడుతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు వ్యతిరేకత మొదలై ప్రజల్లోకి రావడానికి మోహం చాటేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయనున్నట్టు తెలిపారు. ప్రజల నిత్యావసర సరుకులతో పాటు మద్యం ధరలను పెంచారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమంలో వరంగల్ డిక్లరేషన్ ను గడపగడపకు తీసుకువెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాద్యక్షుడు సత్యనారాయణ, నాయకులు రవీందర్ రెడ్డి,శ్రావణ్,కృష్ణ, శ్రీకాంత్, రాజు,నాగారాజు, శ్రీనివాస్ రెడ్డి, ఐలయ్య, సుదీర్ రెడ్డి తదితరులు హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 07:04PM