నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలం లోని పస్రా గ్రామానికి చెందిన నదునూరి పద్మ 45 సంఁ గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న గోవిందరావుపేట మండల ఎంపిపి సూడి శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు, సంవత్సరం క్రితం తండ్రి మరణించడం జరిగింది ఇప్పుడు తల్లి మరణించడంతో అనాథగా మారిన చిన్నారులు కుమార్తె ఇద్దరు కుమారులు చిన్న వయసు కావడంతో ఎంపీపీ 3000 రూపాయలు దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. అనాధలు గా మారిన ముగ్గురి చిన్నారులను కావాల్సిన చదువులకు గురుకులం లో మాట్లాడి తన వంతుగా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాసచారి, మండల ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు ,సుంచు యాకోబు, పసుల సమ్మయ్య, ఊటుకూరి వెంకటరామయ్య, గడ్డం సారయ్య, ధరావత్ పూర్ణచందర్ ,నీలాల మల్లేష్ ,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 20 May,2022 04:34PM