- పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు
నవతెలంగాణ కంటేశ్వర్
టి పి టి ఎఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో టి ఈ టి మాక్ టెస్ట్ కాకతీయ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో నిజాంబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు శుక్రవారం పాల్గొన్నారు. మొదట అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు మెమెంటోలు బహుకరించారు. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే అభ్యర్థులు మరింత కష్టపడాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవం ఉందని, సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత క్రియాశీలకంగా పని చేయాలని కోరారు. డీఎస్సీలో ఉత్తీర్ణులు కావాలంటే పట్టుదల శ్రద్ధ ఆసక్తితో కష్టపడాలని అప్పుడు జీవితంలో మంచి స్థానాల్లో చేరుకుంటారని తెలిపారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందించి, మరిన్ని కార్యక్రమాలను టి పి టి ఎఫ్ కొనసాగించాలని అన్నారు. ఎం ఈ ఓ రామారావు మాట్లాడుతూ టి ఈ టి ఉత్తీర్ణత తప్పనిసరి అని, అందుకే అభ్యర్థులు అన్ని రకాలుగా సంసిద్ధులు కావాలని, అందుకు మరింత కృషి చేయాలన్నారు.టి పి టి ఎఫ్ ఇలాంటి పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు సహకరించడం గొప్ప విషయం అన్నారు. కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సిహెచ్ రజినీకాంత్ మాట్లాడుతూ.. టెట్ పరీక్ష నిర్వహించడం అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుందని టీపిటిఎఫ్ మరింత మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ మాట్లాడుతూ టి పి టి ఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 33 జిల్లాల లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నామని, వారికి అవగాహన కొరకు వారిని సంసిద్ధం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
టెట్ పరీక్ష నిర్వహించడం అవగాహన ఆత్మస్థైర్యం ఇస్తుందని, కొంత అవగాహన పరీక్ష పైన కలుగుతుందని టీ పీటీఎఫ్ నిర్వహిస్తుందని తెలియజేశారు.ఇదే విధంగా టెట్టు ఆన్లైన్ పరీక్షలు కూడా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని, చాలా జిల్లాల్లో టి పి టి ఎఫ్ తరఫున ఉచిత టి ఈ టి శిక్షణ కేంద్రాలు కూడా నడుపుతున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమమును టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శులు మల్లేశం గంగా ప్రసాద్ శ్రీనివాస్ రెడ్డి గోపి ఉపాధ్యక్షులు చందర్, వసంత హస్బెండ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.