నవతెలంగాణ: నవీపేట్: మండలంలోని యంచ, నిజాంపూర్ గ్రామాలలో క్రీడా మైదానంకై ఎంపీడీవో గోపాలకృష్ణ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా యంచ, నిజాంపూర్ గ్రామాలలో స్థలాన్ని పరిశీలించి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాజేశ్వర్, ఆర్ ఐ మోహన్, ఎంపీటీసీ కృష్ణ మోహన్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm