-ఎంపీపీ, తహసిల్దార్ కు ఏఐఏవైఎస్ నాయకుల వినతి
-అంబేడ్కర్ ఆశయం కోసం కలిసి రావాలని బాలనర్సు సూచన
నవతెలంగాణ-బెజ్జంకి
ఎన్నో ఎండ్లుగా మండల కేంద్రంలో అంబేడ్కర్ సామూహిక భవన నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నామని .. అంబేడ్కర్ సామూహిక భవన నిర్మాణానికి సహకరించి 0.10 గుంటల విస్తీర్ణం గల స్థలాన్ని ఇప్పటికైనా కేటాయించాలని ఎంపీపీ లింగాల నిర్మల,తహసిల్దార్ విజయ్ ప్రకాశ్ రావులకు శుక్రవారం ఏఐఏవైఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఏవైఎస్ మండలాద్యక్షుడు దీటీ బాలనర్సు మాట్లాడుతూ అంబేడ్కర్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆయన ఆశయాలను మాత్రం పూర్తి స్థాయిలో ఆచరించడం లేదని అన్నారు. ఇప్పటికైనా అంబేడ్కర్ ఆశయాలను కోనసాగించడాని వర్గ విభేదాలకు స్వస్తి పలికి అంబేడ్కర్ వారసులు కలిసి రావాలని కొరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల శేఖర్ బాబు,టీఏవైఎస్ జిల్లా అధికార ప్రతినిధి చిలుముల దేవదాసు,బీజేపీ మండలాధ్యక్షుడు దొనే అశోక్,శేషు, రూపేష్,టీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు బిగుల్ల మోహన్, నాయకులు లింగాల బాబు,ఘనపురం తిరుపతి,వంగల నరేష్,మాంకాల స్వామి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 20 May,2022 06:39PM