- వివరాలు వెల్లడించిన ఎంఈఓ పావని
నవతెలంగాణ-బెజ్జంకి
ఈ నెల 23న ప్రారంభమయ్యే పది నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎంఈఓ పావని శుక్రవారం తెలిపారు.పది పరీక్షలకు హజరయ్యే విద్యార్థులు, ఏర్పాటు చేసిన పరీక్షల కేంద్రాల వివరాలను ఎంఈఓ పావని వెల్లడించారు. మండలంలో 438 మంది విద్యార్థులు పది పరీక్షలకు హజరవుతున్నారని మండల కేంద్రంలోని బాలికల, బాలుర ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షల కేంద్రాల్లో 307 మంది,హుస్నాబాద్,శనిగరం ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 131 మంది విద్యార్థులు హజరవుతున్నట్టు తెలిపారు.ఉదయం 9.30 ప్రారంభమయ్యే పరీక్షలకు విద్యార్థులు కరోనా నిబందనలు పాటిస్తూ హజరవ్వాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm