నవతెలంగాణ-ధర్మసాగర్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్( టీ డబ్ల్యూ జె ఎఫ్)హనుమకొండ జిల్లా కార్యదర్శిగా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ పోలుమారి గోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టి డబ్ల్యూ జె ఎఫ్)అధ్యక్షులు సోమయ్య తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రథమ మహాసభలు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో స్టేట్ కౌన్సిల్ మెంబర్ బొక్క దయసాగర్ అధ్యక్షతన నిర్వహించగా వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల హక్కుల సాధనకై ప్రతి ఒక్క జర్నలిస్టులు చిన్నా,పెద్ద తేడాలు, తారతమ్యాలు లేకుండా ఐక్యంగా ఉంటూ, సంఘటితంగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం వరంగల్ హనంకొండ జిల్లా ఎన్నికలను ఆయన సమక్షంలో నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యదర్శిగా ఎన్నికైన పోలుమారు గోపాల్ మాట్లాడుతూ తన ఎన్నికకు ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ,జర్నలిస్టుల ఆర్థిక,సామాజిక అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, నేషనల్ కౌన్సిల్ మెంబర్ జగన్,సీనియర్ జర్నలిస్టులు సోమ నరసయ్య, బాబురావు, నవ తెలంగాణ మేనేజర్ దేవేందర్,ప్రశాంత్,శ్రీను,ప్రసాద్, బండి రాజు,ఇసంపల్లి రమేష్, మొగిలిచర్ల శ్రీనివాస్,న గజ్జెల సుమన్,నాగవేల్లి దుర్గరాజ్,బంక శివలాల్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 20 May,2022 06:46PM