తాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్
నవతెలంగాణ- తాడ్వాయికా
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు తద్వారా వారి కుటుంబాలను బలోపేతం చేయడానికి నాటు కోడి పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, ఎంపీపీ వాణిశ్రీ, డి వి ఎం ఓ విజయ భాస్కర్ లు అన్నారు. మండల కేంద్రంలోని మేడారం, ఊరట్టం రెండు గ్రామపంచాయతీ మహిళలకు పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పశు పరిశోధనా స్థానం మామూనూర్, వరంగల్ పశు పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నాటు కోడి పిల్లల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ఒక్కో మహిళకు పది నాటు కోడి పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు కోడి పిల్లల తో పాటు వాటి పెంపకం పై తగిన పలు సూచనలు కూడా అందించనున్నట్లు తెలిపారు. పశు వైద్య అధికారులు అవసరమైన మందులు కూడా ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. రెండు నెలల్లో దాదాపు రెండు కిలోల వరకు బరువు పెరిగి పెరటి కోళ్లు మంచి ఆదాయం అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సైంటిస్టులు డాక్టర్ హనుమంతరావు, ఆమేశ్వరి, సర్పంచులు గొంది శ్రీధర్, చిడం బాబురావు, పంచాయతీ కార్యదర్శి సతీష్, రెండు గ్రామ పంచాయతీల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 20 May,2022 06:49PM