నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అంకంపల్లి బీరెల్లి కామారం గ్రామంలో.. పశువులు వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. జీవనాధారమైన మూగజీవాలు మృతి చెందటంతో.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. మందలో ఉన్న గొర్రెలు గిలగిలా కొట్టుకొని విగతజీవులుగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిలో ఆవు, దూడ సైతం మృతి చెందాయని.. ఏ రోగం సోకిందో తమకు అర్థం కావటం లేదంటూ రైతులు వాపోయారు. కామారం గ్రామానికి చెందిన మూడిగ రాములు అనే రైతుది కోడెదూడ, బక్క రాజ్ కుమార్ ఆర్ అనే రైతు ఒక ఆవు లేగ, మూడిగా ఆయిలు కొమురు ది ఆవు లేగ, దాని పరిసర గ్రామమైన అంకంపల్లి గ్రామంలో సుమారు 20 వరకు పశువులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో కాటాపూర్ పశువైద్య కేంద్రంలో ఎల్ ఎస్ ఏ సుమన్ అనే వైద్యాధికారి 5 నెలల క్రితం ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఎనిమిది గ్రామపంచాయతీ పరిధిలో పశువైద్యాధికారి లేకపోవడంవల్ల ఎన్నో వేల విలువచేసే పశువులు మృతి చెందినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి.. కాటా పూర్ ప్రాంతానికి నూతన పశువైద్యాధికారి నియమించి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి.. పశువులను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 20 May,2022 07:04PM