నవతెలంగాణ-గోవిందరావుపేట
గుత్తికోయలు గూడెంలలో అపరిచితులకు ఆశ్రయం కల్పించ వద్దని పసర సిఐ శంకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రాజెక్టు నగర్ గుత్తి కోయ గూడెం సిఐ శంకర్ ఎస్ఐ సిహెచ్ కరుణాకర్ రావు సిఆర్పిఎఫ్ బలగాలతో సందర్శించారు. అనంతరం గుత్తి కోయ ప్రజలతో సిఐ శంకర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వారికిగూడెం లో ఆశ్రయం కల్పించ రాదన్నారు. ఎవరైనా కొత్తవారు గూడెం సందర్శిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను సంప్రదించాలని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm