నవ తెలంగాణ రాయపోల్ : ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు రావాలని రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపల్లి గ్రామంలో ఈ నెల 13 నుండి జరుగబోయే పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని దౌల్తాబాద్ మరియు రాయపోల్ మండలాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రస్తుత దౌల్తాబాద్ జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కు ఆహ్వాన పత్రికాను అందజేసి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కొత్త పల్లి ముదిరాజ్ సంఘ నాయకులు స్వామి, రాజారాం, బాల్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.