- తెలిసిన ప్రశ్నలకు ముందుగా జవాబులు ఇవ్వండి...
- ప్రధానోపాధ్యాయుడు రాంబాబు
నవతెలంగాణ - అశ్వారావుపేట: పరీక్షా హాలుకు ప్రశాంతంగా వచ్చి ఆందోళన పడకుండా పరీక్షా పత్రాన్ని పరిశీలించి ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని పదో తరగతి విద్యార్ధులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు ప్రధానోపాధ్యాయుడు పత్తేపరపు రాంబాబు సూచించారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో పరీక్షా పత్రం పరిశీలన,ఒ.ఎం.ఆర్ షీట్ నింపే విధానం పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు పాఠ్యాంశాలను మననం చేసుకుంటూ ఉండాలని,పరీక్షా మెలుకువలు తెలిపారు.కాంగారు పడకుండా ప్రతీ వాక్యం అర్ధం వింతగా రాయాలని తెలిపారు.ఈ కార్యక్రమంతో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.