నవతెలంగాణ-గోవిందరావుపేట
ఇందిరమ్మ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంక్ అధ్యక్షుడు పన్నల ఎల్లారెడ్డి ప్రారంభించారు. మండలంలోని ప్రాజెక్టునగర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని రైతుల వద్దకు మరియు గడప గడపకు తిరుగుతూ ఇందిరా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా పస్రా క్లస్టర్ ఇంచార్జిలు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, కుర్సం కన్నయ్య లు రైతుల యొక్క డిక్లరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి మండల సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ రైతులను రాజు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రైతు భరోసా కార్యక్రమం ద్వారా తెలంగాణ రైతులకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ.ఇందిరమ్మ రైతు భరోసా- రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఉపాధి హామిలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు రైతుల పంటకు గిట్టుబాటు ధర, ప్రతి గింజను కొంటాం, ధరలు ముందే నిర్ణయం.మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తాం, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం.మెరుగైన పంటల భీమాను తీసుకోస్తాం, రైతు కూలీలకు, భూమిలేని రైతులకు భీమా. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తాం.పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యాజమాన్య హక్కు.ధరణి పోర్టలును రద్దు చేస్తాం... మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకోస్తాం అన్నారు.నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు.. అమ్మే సంస్థలపై పీడి యాక్టు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తాం.. చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం. రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట పర అధికారాలతో రైతు కమీషన్.వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.రైతు డిక్లరేషన్ కల్పిస్తూ రైతులను రాజులను చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సనప సమ్మయ్య, అలుగుబెల్లి కన్నయ్య, చీమల లక్ష్మీ నారాయణ, రామరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 04:32PM