నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలో శనివారం సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ హాజరై రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు 1944 ఆగష్టు 20న జన్మించిన ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు. భారతదేశ 6వ ప్రధానమంత్రిగా గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడిగా 1984, అక్టోబరు 31 న తల్లి ఇందిరా గాంధీ గారి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు. భారతదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి బాటలు పరిచిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. రాజీవ్ గాంధీ గారు శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మే 21 1991 సంవత్సరంలో మరణించాడు. ఇతని వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్సం కన్నయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, జంపాల చంద్రశేఖర్, మాజీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు పాలడుగు వెంకటకృష్ణ, పాశం మాధవరెడ్డి, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, బోనగాని సారయ్య, రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, సింగపురం కృష్ణ, పడిదల సాంబయ్య, బలగురి శ్రీను, నద్దునూరి రతన్, పంగ శ్రీను, పడిశాల కుటుంబ రావు, బాలు తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 04:38PM