హైదరాబాద్: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలను ఇప్పించి వారి నుంచి భూములు, ఆస్తుల రూపంలో లంచాలు తీసుకున్నారని సీబీఐ అభియోగాలను మోపింది. ఈ క్రమంలో నిన్న లాలూకి చెందిన పలు చోట్ల సీబీఐ సోదాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆర్జేడీ నేత, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాలకు భయపడి, వెన్ను చూపే వ్యక్తి కాదు లాలూ అంటే అని అన్నారు. సత్య మార్గంలో పయనించడం చాలా కష్టమని... అయినా అసాధ్యం కాదని చెప్పారు. కాస్త ఆలస్యం అయినా చివరకు నిజమే గెలుస్తుందని అన్నారు. ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm