- జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ కంటేశ్వర్
స్వర్గీయ భారతరత్న డాక్టర్ రాజీవ్ గాంధీ నీ జీవితం ఈ దేశ యువతకు ఆదర్శం అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం స్వర్గీయ భారతరత్న డాక్టర్ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, అర్బన్ ఇన్చార్జి తాహెర్బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణుతో కలిసి కాంగ్రెస్ భవన్ నందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి అదేవిధంగా వినాయక నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశాన్ని పాలించడంలో తనదైన ముద్ర వేసి నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి అని ,సాంకేతిక రంగంలో సాంకేతిక విప్లవన్ని విశ్వవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి అని, దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్ళిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని ,ఆయన చేసిన సాంకేతిక విప్లవం ద్వారా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలుగా ఎదిగారని, నెహ్రూ గారి గురించి రాజీవ్ గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడే బిజెపి అజ్ఞానులు దీనిని గమనించాలని, రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవంలో ప్రపంచానికి దిక్సూచిగా నిలిచారని ,రాజీవ్ గాంధీ ఆలోచనా విధానాలను స్ఫూర్తిని తీసుకుని జిల్లా కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీల కుట్రల వల్ల దేశం విచ్ఛిన్నం అవుతుందని ,విష ప్రచారాలకు గురవుతుందని గమనించిన రాహుల్ గాంధీ వరంగల్ కు వచ్చినప్పుడు రైతులకు మార్గదర్శకం చేస్తూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన వరంగల్ డిక్లరేషన్ చేయడం జరిగిందని, బిజెపి టిఆర్ఎస్ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటే దానిని అడ్డుకోవడానికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ డిక్లరేషన్ ను ఇంటి ఇంటికి తీసుకువెళ్ళే బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన ఉందని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ,రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నెల రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఇంటికి వరంగల్ డిక్లరేషన్ అందించాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రాంభూపాల్ , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ ,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్, జిల్లా ప్రభా గండ కమిటీ చైర్మన జావిద్ అక్రమ్,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోల ఉష, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరికొండ గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు ధర్మ గౌడ్ ,మల్లికాబేగం,అషాభి, ప్రమోద్,హుస్సేన్, అబుద్, రూపేష్,ముష్షు, విశాల్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 05:11PM