నవతెలంగాణ కంటేశ్వర్
భారత దేశం మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫెర్స్, న్యూఢిల్లీ వారి ఆదేశాను సారంగా శనివారం ఉదయం పోలీస్ కార్యాలయం యందు పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్. ఉత్తర్వుల మేరకు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ అరవింద బాబు ఆద్వర్యంలో యాంటి టెర్రరిజం దినం కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి కమీషనర్ అరవింద బాబు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటి కమీషనర్ అరవింద బాబు మాట్లాడుతూ.. ఇన్ భారత దేశంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాటిని సాధించడానికి ప్రజాస్వామ్య పద్దతిలో కాకుండా టెర్రరిస్టులు ప్రజలను భయబ్రాంతుల కు గురిచేస్తు , విధ్వాంసాలు సృస్టిస్తూ వాళ్లు సాదించాలను కునే లక్ష్యాన్ని సాధిస్తారు. అలాంటి వారి చర్య ల వలన ఏ దేశం, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు. కావున మనం ఎన్నో రకాలుగా దేశం అభివృద్ధి కోసం పాటుపడుతూ వారి చర్యలను ప్రతి ఒక్కరు పోరాడి ముందుకు వెళ్లాలి. ఇందులో కుల / మత / ప్రాంత జాతి అనే విభేదాలు పెట్టుకోవద్దు. అప్పుడే మనం అనుకున్న లక్ష్యన్ని సాధించవచ్చు అని అన్నారు.ఈ సమావేశం యందు జిల్లా పరిపాలన అధికారి (ఎ.ఓ) రామారావు, సూపరింటెండెంటులు మహ్మద్ మక్సూద్ హైమద్, గోవింద్ సి.సి.ఆర్.బి సిబ్బంది, ఎన్.ఐ.బి సిబ్బంది మరియ పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 05:22PM