- గొంది దివాకర్ మండల విద్యాధికారి
నవతెలంగాణ-గోవిందరావుపేట
పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను సమర్థవంతంగా చూడాలని మండల విద్యాధికారి గొంది దివాకర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విద్యావనరుల కేంద్రంలో పదవ తరగతి పరీక్షల నిర్వాహకులు సి ఎస్ మరియు డివో లు. ఇన్సులేటర్ లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ మండలంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు 1. బాలికల ఉన్నత పాఠశాల గోవిందరావుపేట. 2. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పసర. కేంద్రాలలో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బాలికల ఉన్నత పాఠశాల గోవిందరావుపేటలో తెలుగు మీడియం బాయ్స్ 14, గర్ల్స్ 26 మంది మొత్తం 40మంది. ఇంగ్లీష్ మీడియం బాయ్స్ 67, గర్ల్స్ 48 మొత్తం 115 మంది. అదేవిధంగా పసర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియం బాయ్స్ 16, గర్ల్స్ 28 మొత్తం 44 మంది. ఇంగ్లీష్ మీడియం బాయ్స్ 55, గర్ల్స్ 52 మొత్తం 107 విద్యార్థులు కాగా 151 మంది. పై రెండు సెంటర్లలో కలిపి తెలుగు మీడియం 84 ఇంగ్లీష్ మీడియం 222 మొత్తం విద్యార్థులు 306 మంది పదవ తరగతి పరీక్ష లకు హాజరవుతున్నట్లూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లను తావులకుండా పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ డి వో లు కేశవరావు సూర్యనారాయణ చంద్రారెడ్డి రాజు తో పాటు ఇన్సులేటర్ లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 06:23PM