- ధన్ పాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
రైతుల బాధలు, కష్టాలు ముందుగా కెసిఆర్ తెలుసుకోవాలని బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బిజేపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అవినీతిలో నెంబర్ 1గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ స్థానం సంపాదించుకున్నరని అన్నారు. నార్త్ ఇండియాలో 5రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 6వందల మంది రైతులు మృతి చెందితే వారికి ఒక్కో కుటుంబానికి 3 లక్షలు అందించడానికి బయలు దేరారని దుయ్యబట్టారు. కానీ తెలంగాణా లో ఇప్పటివరకూ ఎ ఒక్క రైతుని పరమర్శించని దాఖలాలు లేవని అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, యాసంగిలో వచ్చిన వడ్లను ఇప్పటి వరకు కొనుగోలు చేసిన పాపాన పోలేదన్నారు. అకాల వర్షాలకు కళ్లాలలో ధాన్యం తడిసి ముద్దవుతుందని, ఏనాడు రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకోలేదని, రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానన్న హామి, రుణ మాఫి ఇప్పటి వరకు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులు రాజకీయం చేసి వడ్లు తీసుకోమని చెప్పి వందల కోట్లు ఖర్చు చేసి ధర్నాలు, చివరకు వడ్లు మేమే కొంటామని చెప్పి 37రోజులు గడుస్తున్నా అరకొర వసతుల మధ్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అని అన్నారు. 9లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో సేకరించాల్సి వస్తే ఇప్పటి వరకు సగం పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామ్‌కే వాస్తే అన్నట్టుగా మంత్రులు వెళ్లి వచ్చారు తప్ప రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. ప్రొక్యూర్‌మెంట్ సెంటర్‌లో వడ్లు కొనుగోలు చేస్తే ధాన్యం సంచులు లేదు, రవాణకు లారీలు లేవు, అకాల వర్షాలు పడితే వడ్ల తడుస్తున్నా వారికి టార్పిన్‌లు ఇవ్వలేదు. ఇక్కడ ఇన్ని సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా, తెలంగాణ సొమ్మును పంజాబ్, ఢిల్లీ రైతులకు ఇవ్వడానికి వెళ్లిన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, ఎవరి సొమ్ము అని అక్కడికి వెళ్లావని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలను, రైతులను పట్టించుకొని ఇక్కడి సమస్యలు పరిష్కరించిన తర్వాత ఎక్కడికైనా పో అని హితవు పలికారు. తెలంగాణలో గత సంవత్సరం 6వందల నుండి 8వందల వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులకు 10వేలు రైతు బందు ఇస్తున్నానని ఎరువులపై ఉన్న సబ్సిడి, విత్తనాలపై సబ్సిడి ఎత్తేసి అంతకంటే ఎక్కువ నష్టం చేస్తున్న ఘనుడు అని దుయ్యబట్టారు. తెలంగాణలో సుమారు 15లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారికి ఇప్పటి వరకు ఆదుకునే పరిస్థితి లేదని, వారు ఎకరానికి సుమారు 40 నుండి 50వేలు కౌలుకు చేస్తున్నారని, రైతు బంధు పేరుతో వందల కోట్లు భూస్వాములకు దోచి పెడుతున్నావని అన్నారు. తెలంగాణలో రైతు పంట భీమాలేదని, అకాల వర్షాల తోటి పంట నష్టమైతే భీమా ఉన్న రైతులకు ఎంత నష్టం వచ్చినా వారికి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వస్తాయని, ఇక్కడ 33శాతం పైనా నష్టం వస్తే అన్లిమిట్ పెట్టి గత సంవత్సరం లక్షల ఎకరాలలో పంట నష్టం ఐతే 15వేల ఎకరాలు పెట్టి ఇప్పటి వరకు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో రైతులు పరిస్థితి ఈవిధంగా ఉందని టిఆర్‌ఎస్‌ను బొంద పెట్టడానికి రైతులు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, మాజీ అధ్యక్షుడు పంచరెడ్డి లింగం, కార్పొరేటర్లు పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్, మాస్టర్ శంకర్, మల్లేష్ యాదవ్, మెట్టు విజయ్, ఎర్రం సుదీర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి బద్ధం కిషన్, జిల్లా దళిత మోర్చా అద్ధ్యక్షులు శివ ప్రసాద్, మైనార్టీ మోర్చా అద్ధ్యక్షులు కైసర్, జోన్ అద్ధ్యక్షులు రోషన్ లాల్, పుట్ట వీరేందర్, మీసేవ శ్రీనివాస్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 06:56PM