- కాటాపూర్ లో కళాజాత బృంద ప్రచారం
నవతెలంగాణ- తాడ్వాయి
ప్రభుత్వ రంగ సంస్థ టీఎస్ ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగుల కళాజాత బృందం విరివిగా ప్రచారం చేశారు. కళాజాత బృందం టీం లీడర్ ఆర్ సాంబయ్య ఆధ్వర్యంలో మండలంలోని కాటాపూర్ గ్రామంలో శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రాణాంతకం అనే అంశాలపై పల్లె సుద్దులు, జానపద గీతాలు గ్రామీణులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ అందిస్తున్న రాయితీలు, సౌకర్యాలు వివరించారు. ఇరవై రోజుల బస్ పాస్ తీసుకుంటే పది రోజులు ఉచితంగా మొత్తం 30 రోజులు ప్రయాణ సౌకర్యం, ఎలాంటి అడ్వాన్స్ డబ్బులు తీసుకోకుండా వివాహ మొదలైన శుభకార్యాలకు కూడా బస్సు సర్వీస్ అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థినీలకు10, విద్యార్థులకు 7వ తరగతి వరకు రాయితీతో కూడిన ఉచిత పాస్ సౌకర్యం కల్పిస్తున్నామని, దివ్యాంగులకు, జర్నలిస్టులకు ఉచిత పాసులు అందిస్తున్నట్లు వివరించారు. కార్గో పార్సిల్, కొరియర్ సేవలు అందిస్తూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకోసం డ్రైవింగ్ స్కూళ్లను అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నామని యువకులకు, హేవీ డ్రైవింగ్ శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రం దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడ కళాజాత ద్వారా పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ ఉద్యోగులు టి శంకర్, పి వెంకటేశ్వర్లు, బి రాజు, డి శ్రీనివాస్, ఎంవి స్వామి, వి వై స్వామి, కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు లు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 07:05PM