- జిల్లా ప్రాంటేషన్ మేనేజర్ మహేందర్ రెడ్డి అదేశాల
- కూలీల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
నవతెలంగాణ-బెజ్జంకి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి నర్సరీల్లోని మొక్కలను సిద్దం చేయాలని జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ మహేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.శనివారం మండల పరిదిలోని బెజ్జంకి క్రాసింగ్,ముత్తన్నపేట,దాచారం,వీరాపూర్,లక్ష్మీపూర్, గూడెం గ్రామాల్లోని నర్సరీలను మహేందర్ రెడ్డి సందర్శించి మొక్కలను పరిశీలించారు.కూలీల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ నర్సరీల్లోని మొక్కలను సంరక్షించాలని మహేందర్ రెడ్డి తెలిపారు.అయా గ్రామాల సర్పంచులు టేకు తిరుపతి,పేంటమీదీ శ్రీనివాస్,పెండ్యాల బాపు రెడ్డి, ఉప సర్పంచులు తిరుపతి రెడ్డి,భాస్కరా చారి, వార్డ్ సభ్యులు,టీఏలు రాజు,కిష్టయ్య,పంచాయితీ కార్యదర్శులు రమేశ్,అనిల్,బాబు,టీఆర్ఎస్ నాయకులు బాల సుధీర్ రావు తదితరులు హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 07:47PM