నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో క్రీడాకారుల కోసం మంజూరైన నిధులతో ఏర్పాటు చేయనున్న క్రీడా ప్రాంగణాన్ని శనివారం గ్రామ సర్పంచ్ నరసింహులు యాదవ్ ఎంఆర్ఓ నరసింహులు తో కలిసి స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వెనుక ఉన్న స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణానికి అనువైన స్థలం లభించిందని, వెంటనే పనులను మొదలు పెట్టాలని ఎమ్మార్వో సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ సిద్ధిరాములు, రైతు వేదిక అధ్యక్షుడు పుల్లూరు శివలింగం, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తిలి శ్రీనివాస్,,టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm