- ప్రజాసంఘాల డిమాండ్
నవతెలంగాణ-మంథని
మంథని మున్సిపాలిటీ పరిధిలోని పాత పెట్రోల్ బంక్ దగ్గర అర్ధరాత్రి సమయంలో ఇసుక టిప్పర్ డీకొనడంతో తెలంగాణ తల్లి విగ్రహం పూర్తిగా ధ్వంసం అయిన. సంఘటన స్థలాన్ని వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కార్యదర్శి బూడిద గణేష్,ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల. సందీప్,డి.వై.ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి గొర్రెంకల సురేష్ లు సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఇదే ప్రాంతంలో పెట్రోల్ బంక్ లోపనిచేసే హరికృష్ణ గౌడ్ ఇసుక లారీ డీకొనడంతో చనిపోయాడని, ఇదే ప్రాంతంలో ఇసుక లారీలు విధ్వంసన్నీ సృష్టిస్తున్నాయని వారు ఆరోపించారు. ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలనీ పలు మార్లు కోరినప్పటికి ఆర్.అండ్.బి అధికారులు, సాండ్ టాక్స్ అధికారులు, సంబంధిత అధికారులలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. మంథని ప్రాంతం ఇసుక మాఫియాoత అడ్డాగా మారిందని, రాత్రి సమయంలో ఇసుక లారీలు,ట్రాక్టర్ లు నడుపరాదని నిబంధనలు ఉన్నప్పటికి అక్రమార్కులు దొంగ చాటున ఇసుకను తరలిస్తున్నారని ఆయన అన్నారు. ఇసుక లారీలు అధిక లోడ్, ఓవర్ స్పీడ్ తో వెళ్లడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు, స్థానికులు,ప్రజలు బయటికి వెళ్దాం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఆ ప్రాంతంలో స్పీడు బ్రేకర్లు, సూచిక బోర్డు లు, సైన్ బోర్డు లు ఏర్పాటు చేయాలనీ,సాoడ్ టాక్సీ పాలసీని పగడ్బందీగా అమలు చేయాలనీ, ధ్వంసమైనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 08:01PM