- జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
నవతెలంగాణ-మంథని
శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు కాలువల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పెద్ద పల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. శనివారం ఈజీఎస్ పథకంలో బాగంగా డీ- 83కెనాల్ సమీపంలోని పుట్టపాక, శ్రీరాంనగర్ గ్రామాల్లో కాలువల పూడికతీత పనులను జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హమీ పథకంతో ఇటు రైతులకు,అటు కూలీలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ పథకం ద్వారా కాలువల పూడిక తీత పనులను గుర్తించి మొదలు పెట్టామన్నారు.పూర్తిస్తాయిలో కాలువల ద్వారా నీరు పారే విదంగా పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. చివరి భూములకు సాగునీరు అందించి పంటలు పండేలా కృషి చేస్తామన్నారు. ఉపాధి హమీ పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, రైతుల పంట పొలాలకు సాగునీరు అందేలా పనులు చేయించాలని అదికారులకు ఆయన సూచించారు. ఈసందర్బంగా ఉపాధి హమీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఉపాది కూలీలు, పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 08:09PM