నవతెలంగాణ-మంథని
మంథని మండలం వెంకటాపూర్, పల్గుల గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ యువజన నాయకులు 20మంది, డీసీసీ ఉపాధ్యక్షులు, అన్నారం ఎంపీటీసీ మంచినీళ్ల దుర్గయ్య, పల్గుల గ్రామశాఖ అధ్యక్షులు మానేం మహేష్, మాజీ సర్పంచ్ ఒద్ది చంద్రయ్య, సింగిల్ విండో డైరెక్టర్ వడ్లకొండ సమ్మన్న, యువజన నాయకులు పసుల రాజబాపు, జిల్లెల్ల సంతోష్ లు మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm