నవతెలంగాణ -మంథని
మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో శనివారం శనివారం మాజీ మంత్రి,ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సిసి రోడ్లు ప్రారంభించారు.సింగరేణి సీఎస్ఆర్ నిధుల నుండి బిట్టుపల్లి పాఠశాల నుంచి ఆర్ అండ్ బి రోడ్ వరకు మంజూరు చేసిన రూ.5 లక్షల సిసి రోడ్డుకు ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm