- గోదావరి జలాలను స్థానిక ప్రజలు ఇవ్వాలి
నవతెలంగాణ కన్నాయిగూడెం
శనివారం ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సితక్క కన్నాయిగూడెం మండలంలో పర్యటించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సింగారం గ్రామంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పులామాల వేసి నివాళులర్పించారు. తదనంతరం సింగారం గ్రామంలో వరంగల్ రైతు డిక్లేరేషన్ కరపత్రాన్ని విడుదల చేసారు. అనంతరం ఏటూర్ గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే సితక్క మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో గడప,గడపకు వరంగల్ రైతు డిక్లేరేషన్ ను తీసుకెళ్లాలని నాయకులకు,కార్యకర్తలకు దిశ,నిర్దేశం చేసారు.అలాగే గోదావరి జలాలను స్థానిక మండల ప్రజలకు త్రాగు, సాగు నీరు అందించాలని అన్నారు.గోదావరి జలాలను స్థానిక ప్రజలకు ఇవ్వకుంటే భవిష్యత్ లో పెద్ద ఎత్హున ఉద్యమాలు చేపట్టుతమని అన్నారు.అలాగే తామర పురుగు వలన నష్టపోయిన మిర్చి రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందివ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు.కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బు రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు వెంకన్న,మండల కాంగ్రెస్ అద్యక్షుడు అప్సర్ ఫాష, ఎంపీపీ జనగాం సమ్మక్క, వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్, ఏటూర్ ఎంపీటీసీ చిట్యాల శైలజ సీనియర్ నాయకులు అరుణ్ కుమార్, జాడీ రాంబాబు,సునార్కని రాంబాబు, మాచర్ల బాబు, ఉపసర్పంచ్ గడ్డం నగేష్, గాయం రాజబాబు పల్లా లచ్చబాబు తదితరులు పాల్గోన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 08:17PM