- తెలంగాణ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం సంపత్ రావు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరణించిన 68 మంది డాక్టర్ల జ్ఞాపకార్థం స్మారక స్థూపం ఏర్పాటు చేశామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం సంపత్ రావు అన్నారు. శనివారం కోఠి లోని ఐఎంఏ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి ఎంతోమంది ప్రజల ప్రాణాల ను వైద్యులు కాపాడారని అన్నారు. ప్రజలను వైరస్ నుంచి రక్షించే ప్రయత్నంలో వైద్యులు కూడా కరోనా వైరస్ సోకి రాష్ట్రంలో 68 మంది వైద్యులు కరోనా బారిన పడి మృతి చెందారని తెలిపారు. వైద్యుల జ్ఞాపకార్థం స్మారక స్థూపాన్ని కొఠి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశామని ఈ స్మారక స్థూపాన్ని ఐఎంఏ జాతీయ లు డాక్టర్ సహజనంద్ ప్రసాద్ సింగ్ ఆదివారం ఆవిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐఎంఏ సభ్యులందరూ. వైద్యుల కుటుంబ సభ్యులు. వైద్యులు పాల్గొనాలని అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బి. నరేందర్ రెడ్డి .కోశాధికారి డాక్టర్ గట్టు శ్రీనివాసులు. డాక్టర్ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 May,2022 09:09PM